NTV Telugu Site icon

Surveillance Vulture: సరిహద్దులో “నిఘా రాబందు”.. కాళ్లకు జీపీఎస్, మైక్రో కెమెరా..

Surveillance Vulture

Surveillance Vulture

ఆ రాబందు.. చూడటానికి సాధారణంగానే ఉంది. కానీ.. దాని కాళ్లకు మాత్రం జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరా అమర్చారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని.. బాగా అలసిపోయింది ఆ రాబందు. కొందరు దాన్ని గమనించి చికెన్ తో పాటు, నీళ్లు అందించారు. ఎంచక్కా తిన్న తర్వాత ఆ రాబందు సేదతీరింది. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. ఆ రాబందు కాళ్లకు అమర్చిన పరికరాల ఆధారంగా దానిపై ప్రస్తుతం సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

READ MORE: Varahi Declaration: సనాతన ధర్మం డిక్లరేషన్ ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం.. కీలక అంశాలు ఇవే..!

ఈ రాబందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో లభించినట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల క్రితం చర్లలో సంచరించిన రాబందు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడి నుంచో చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం గుట్ట ప్రాంతానికి వచ్చిన రాబందు చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. తిరిగి తిరిగి వచ్చిన రాబందు అలసిపోవడంతో స్థానికులు గమనించి కోడి మాంసాన్ని తీసుకువచ్చి వేశారు. దీంతో కోడి మాంసాన్ని తిని ఆకలి తీర్చుకుంది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం వేరే ప్రాంతానికి ఎగిరి వెళ్లిపోయింది.

READ MORE:Viral Video: ట్రాఫిక్ జామ్‌లో చిక్కుక్కున్న అమ్మాయి.. ఏం చేసిందో చూడండి

అక్కడ ఉన్న స్థానికులు దాని ఫొటోలను వీడియోలు తీశారు. దాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఇది కేంద్ర బలగాలు ప్రవేశపెట్టిన అస్త్రంగా పేర్కొన్నారు. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే ల్యాండ్ మైన్ల కారణంగా భారీగా నష్టపోయిన సీఆర్​పీఎఫ్​ బలగాలు.. మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్టుల ట్రాప్​లో పడకుండా వారి ఆచూకీ కోసం సరికొత్త పంథా అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఓ వైపు డ్రోన్లు, మరోపై ఇలా పక్షుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అడవుల్లోని అణువనువూ వెతుకుతున్నారు. ఇలా పక్షి రూపంలో ఉంటే నక్సలైట్ల అనుమానం రాదని నిఘా వార్గాలు భావించాయి. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Show comments