NTV Telugu Site icon

India-China: చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

S Jaishankar

S Jaishankar

చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ సమాధానమిచ్చారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు అంశాలపై ఇంకా సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని తెలిపారు.

READ MORE: Elections 2024: రేపే నాల్గో విడత పోలింగ్‌.. ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్..

ప్రధాని ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌-చైనా సరిహద్దు సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దేశాల మధ్య సయోధ్య అవసరమని.. ఇరుదేశాల మధ్య సంబంధాలు కేవలం భారత్‌, చైనాకే కాకుండా యావత్‌ ప్రపంచానికి చాలా కీలకమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న ప్రశ్నకు జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకూ జైశంకర్‌ స్పందించారు. 2014కి ముందు తయారీ రంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కుండబద్దలు గొట్టారు. 2020లో గల్వాన్‌లో సైనిక ఘర్షణ తర్వాత భారత్‌-చైనా మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పలు దఫాల్లో చర్చలు జరిగినప్పటికీ.. ఇంకా అనేక అంశాలపై సయోధ్య కుదరలేదు. భారత్ వైఖరి న్యూట్రల్ గానే ఉన్న చైనా మాత్రం ఖయ్యానికి కాలుదువ్వుతోంది.