Site icon NTV Telugu

IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆడేందుకు చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు..

Ind Vs Ban

Ind Vs Ban

IND vs BAN Test Series: సెప్టెంబర్ 19 నుంచి భారత క్రికెట్ జట్టు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు. తొలి టెస్టు చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరగనుంది. చెన్నై చేరుకోగానే ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వీడియోలో కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత రోహిత్, విరాట్‌లు టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇకపోతే., రోహిత్ సారథ్యంలోని 16 మంది సభ్యుల జట్టులోకి కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ తిరిగి వచ్చారు. కొత్తగా యశ్ దయాళ్‌కు కూడా టీమ్‌లో అవకాశం దక్కింది. ఒకసారి మొదటి టెస్ట్ కు భారత జట్టు గమనించినట్లైతే ఇలా ఉంది.

తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ , శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ . యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా మరియు యశ్ దయాల్.

2000 సంవత్సరంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో భారత జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. బంగ్లాదేశ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టు అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాలేదు.

Exit mobile version