పండగవేళ తమ సంతోషాలను స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకునే వారికి బిగ్ షాక్. స్వీట్స్ ఎంతో టేస్టీగా ఉన్నాయని లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 45 షాపుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. స్వీట్స్ తయారీ లో విచ్చలవిడిగా గా రసాయన పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు అధికారులు.
Also Read:Mass Jathara : ధనుష్ ప్లేస్‌లో రవితేజా? షాక్ ఇచ్చిన దర్శకుడు..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్వీట్ షాపుల యజమానులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన స్వీట్ లవర్స్ షాపు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కల్తీ పదార్థాలు, కాలం చెల్లిన పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు.
