హైదరాబాద్‌లో పలుచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. నగరంలో ఫుడ్ కల్తీ ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, అమీర్ పేట్‌లోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్‌తో పాటు మెహదీపట్నంలోని అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్‌లోని యూనివర్సల్ ఆల్ మతం మండి కబాబ్స్ అండ్ బిర్యానీ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. కొన్ని రెస్టారెంట్లు సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించి.. వాటిని సీజ్ చేశారు. అనంతరం టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపించారు.
Read Also: Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోంది.. ప్రళయం తప్పదా..?
మరోవైపు.. యూసఫ్ గూడా రత్నదీప్ సూపర్ మార్కెట్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. FSSAI నిబంధనలను విరుద్ధంగా నిర్వహణ ఉన్నట్లు గుర్తించి.. ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలా చోట్ల హాస్టల్స్, రెస్టారెంట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వహకులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Nayanthara: నయనతార వెడ్డింగ్ సీన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందో తెలుసా?
ఇటీవల జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై చేసిన దాడుల్లో చీకటి నిజాలు వెలుగుచూశాయి. అక్కడ కుళ్లిన చికెన్, పురుగులు పట్టిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. చాలా చోట్ల బిర్యానీల్లో బల్లులు, బొద్దింకలు, పలు అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. ఈ పరిణామాలతో అనేక హోటళ్లను సీజ్ చేశారు. బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే.. హోటల్స్, రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దీంతో.. సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగుతున్నాయి.