Site icon NTV Telugu

Food poisoning: ఫ్రిజ్ లో నిల్వ చేసిన మటన్ తిన్న కుటుంబం.. ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి.. ఏడుగురికి సీరియస్

Food Poison

Food Poison

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఒకే కుటుంబంలో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఎల్బీనగర్ చింతలకుంటలో ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మటన్ ను వండి ఫ్రిజ్లో పెట్టుకుంది. ఫ్రిజ్లో లో నిల్వ చేసిన మటన్ ని ఈ రోజు తిరిగి తినడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఏడుగురు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వారిని చింతలకుంటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version