NTV Telugu Site icon

Paralysis: పక్షవాతం దరిచేరకుండా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి

New Project (11)

New Project (11)

మనిషి రోజూ తీసుకునే ఆహారం, జీవన విధానం వల్లే వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధులు మనల్ని జీవితాంతం మంచానికే పరిమితం చేస్తాయి. అలాంటి వాటిట్లో ఒకటి పక్షవాతం. పక్షవాతానికి అధిక రక్తపోటు అతి పెద్ద కారకం. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్లకు 80 ఏళ్లకు ముందే పక్షవాతం వచ్చే అవకాశం 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉందని నిపుణుల చెబుతున్నారు. రక్తపోటును మందులు వేసుకోవటం, ఆహార, విహార మార్పులతో అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ మితి మీరకుండా జాగ్రత్తపడాలి. కొలెస్ట్రాల్‌ శాతం పెరిగితే.. రక్తనాళాలును దెబ్బతీస్తాయి. ఇది రక్తనాళాల మార్గం సన్నబడటానికి, పూడికలకు దారితీస్తుంది. పూడిక మరీ పెరిగితే రక్తనాళం మూసుకుపోవచ్చు. ఆ భాగం చిట్లిపోయి రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. మెదడు రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షవాతానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అందరిలో మధుమేహం కామన్ గా మారింది. చిన్న పిల్లలకు కూడా ఈ సమస్య వస్తుంది. కాగా దానిని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మధుమేహంతో మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. ఇది పక్షవాతం ముప్పు పెంచుతుంది. మధుమేహం గలవారిలో అధిక రక్తపోటూ కనిపిస్తుంటుంది.

READ MORE: Heatwave: దేశంలోని పలు ప్రాంతాల్లో 48.8 డిగ్రీల ఎండలు.. ‘రెడ్’ వార్నింగ్ జారీ

పొగ తాగటం చాలా ప్రమాదకరం. ఇతర ముప్పు కారకాలేవీ లేకపోయినా ఒక్క దీంతోనే పక్షవాతం ముప్పు పెరుగుతుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. మానేసిన రెండేళ్ల తర్వాత పక్షవాతం ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ఐదేళ్ల తర్వాత అయితే పొగ తాగనివారి స్థాయికి ముప్పు పడిపోతుంది.
మాదక ద్రవ్యాలు కూడా చాలా ప్రమాదం. మాదక ద్రవ్యాలతో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. వీటిని తీసుకున్న ప్రతీసారీ ముప్పు పెరుతోంది. దీనికి ఇతర ముప్పు కారకాలూ తోడైతే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కొందరికి రక్తనాళాల గోడ బలహీనంగా ఉన్నచోట బుడగలా ఉబ్బుతుంది (అన్యూరిజమ్‌). ఇవి చిట్లిపోయి రక్తస్రావం కావొచ్చు. ఇది మెదడు చుట్టుపక్కల చేరుకొని లోపల పీడనం పెరగొచ్చు. ఫలితంగా వాపు, కొన్నిసార్లు పక్షవాతమూ సంభవించొచ్చు. చిన్న చిన్నవి.. 3 మి.మీ. కన్నా తక్కువ వ్యాసం గల రక్తనాళ ఉబ్బులతో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ 7 మి.మీ. కన్నా పెద్దగా ఉంటే రక్తస్రావమయ్యే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్య గలవారు ఉన్న వాళ్లు వైద్యుల సూచనలు పాటించి నయం చేసుకునేందుకు యత్నించడం మంచింది.