Ron DeSantis: అమెరికా అధ్యక్ష రేసులో ఫ్లోరిడా గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లోరిడా గవర్నర్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసుపై ఆసక్తి కనబరిచాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని ఆయన వెల్లడించారు. అయితే అందుకు ఆయన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం స్టార్ట్ చేశాడు. అమెరికా పునర్వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Also Read : Amy Jackson : అయ్యో.. అమీ..ఇలా అయిపోయావేంటి?
Also Read
యూఎస్ కు సారథ్యం వహించే ధైర్యం కావాలి, గెలిచే శక్తి ఉండాలి అంటూ తన ప్రచార నినాదాన్ని సైతం రాన్ డెశాంటిస్ ప్రకటించారు. అయితే.. ఆ సమయంలో ట్విటర్ క్రాష్ అయిపోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బిడ్‌ను ధృవీకరిస్తూ ఫెడరల్ ఎన్నికల అధికారులకు నామినీ పత్రాలను దాఖలు చేశాడు. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా.. రాన్ డెశాంటిస్ బిడ్‌లో నిలిచినట్లయ్యింది.
Also Read : Gautam Adani : ప్రపంచంలోని టాప్- 20 బిలియనీర్ల జాబితాలోకి మళ్లీ గౌతమ్ ఆదానీ
ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్‌తో కలిసి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ లైవ్ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు. ఆరున్నర లక్షల మందికిపైగా ఆ సంభాషణను లైవ్‌లో విన్నారు. ఇంకేం.. ఆ సమయంలో ట్విటర్ సర్వర్ పదే పదే క్రాష్ అయ్యింది. గతేడాది అక్టోబర్‌లో ఎలన్ మస్క్.. ట్విటర్‌ను టేకోవర్ చేశాడు. ఆ సమయంలోనే వేలమంది ఉద్యోగులను తొలగించాడు. వాళ్లలో బగ్స్‌ను ఫిక్స్ చేసే ఇంజినీర్లు సైతం ఉండడం గమనార్హం.
Also Read : Tension in OU: ఓయూలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ఒకేసారి ట్విటర్‌పై లక్షల్లో యూజర్లు ఎగబడినప్పుడు.. ఆ హెవీ ట్రాఫిక్ కారణంగా ఇలాంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ట్విటర్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇది ఆరోసారి. అయితే.. ఈ ప్రభావం ట్విటర్‌ను ముందు ముందు దారుణంగా దెబ్బ తీయొచ్చని సాంకేతిక నిపుణులు వెల్లడించారు. మరోవైపు అదే టైంలో.. #FailuretoLaunch #Crashed, #DeSaster లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్ లో ట్రెండ్ అవుతుండడం గమనార్హం.
తాజావార్తలు
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..