Site icon NTV Telugu

Ron DeSantis: అమెరికా అధ్యక్ష రేసులో ఫ్లోరిడా గవర్నర్‌

Radison

Radison

ఫ్లోరిడా గవర్నర్‌ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసుపై ఆసక్తి కనబరిచాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని ఆయన వెల్లడించారు. అయితే అందుకు ఆయన సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెశాంటిస్‌ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం స్టార్ట్ చేశాడు. అమెరికా పునర్వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Also Read : Amy Jackson : అయ్యో.. అమీ..ఇలా అయిపోయావేంటి?

యూఎస్ కు సారథ్యం వహించే ధైర్యం కావాలి, గెలిచే శక్తి ఉండాలి అంటూ తన ప్రచార నినాదాన్ని సైతం రాన్ డెశాంటిస్ ప్రకటించారు. అయితే.. ఆ సమయంలో ట్విటర్‌ క్రాష్‌ అయిపోవడం గమనార్హం. అంతకు ముందు ఆయన రిపబ్లికన్‌ పార్టీ తరుపున అధ్యక్ష బిడ్‌ను ధృవీకరిస్తూ ఫెడరల్‌ ఎన్నికల అధికారులకు నామినీ పత్రాలను దాఖలు చేశాడు. దీంతో రిపబ్లికన్‌ పార్టీ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా.. రాన్‌ డెశాంటిస్ బిడ్‌లో నిలిచినట్లయ్యింది.

Also Read : Gautam Adani : ప్రపంచంలోని టాప్- 20 బిలియనీర్ల జాబితాలోకి మళ్లీ గౌతమ్ ఆదానీ

ట్విటర్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌తో కలిసి ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెశాంటిస్‌ లైవ్‌ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు. ఆరున్నర లక్షల మందికిపైగా ఆ సంభాషణను లైవ్‌లో విన్నారు. ఇంకేం.. ఆ సమయంలో ట్విటర్‌ సర్వర్ పదే పదే క్రాష్‌ అయ్యింది. గతేడాది అక్టోబర్‌లో ఎలన్‌ మస్క్‌.. ట్విటర్‌ను టేకోవర్‌ చేశాడు. ఆ సమయంలోనే వేలమంది ఉద్యోగులను తొలగించాడు. వాళ్లలో బగ్స్‌ను ఫిక్స్‌ చేసే ఇంజినీర్లు సైతం ఉండడం గమనార్హం.

Also Read : Tension in OU: ఓయూలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఒకేసారి ట్విటర్‌పై లక్షల్లో యూజర్లు ఎగబడినప్పుడు.. ఆ హెవీ ట్రాఫిక్‌ కారణంగా ఇలాంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ట్విటర్‌ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇది ఆరోసారి. అయితే.. ఈ ప్రభావం ట్విటర్‌ను ముందు ముందు దారుణంగా దెబ్బ తీయొచ్చని సాంకేతిక నిపుణులు వెల్లడించారు. మరోవైపు అదే టైంలో.. #FailuretoLaunch #Crashed, #DeSaster లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌ లో ట్రెండ్‌ అవుతుండడం గమనార్హం.

Exit mobile version