NTV Telugu Site icon

Flipkart New Sale: మరో సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్స్!

Flipkart Big Bachat Dhamaal Sale 2023

Flipkart Big Bachat Dhamaal Sale 2023

Flipkart Big Bachat Dhamaal Sale 2023 Start From August 11 to 13: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ గత కొన్నిరోజులుగా వరుస సేల్‌లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ఆగష్టు 4 నుంచి 9 వరకు నిర్వహించింది. ఈ సేల్ అలా ముగిసిందో లేదో.. ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ (Big Bachat Dhamaal Sale 2023)ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు.. 3 రోజుల పాటు కొనసాగనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ మిస్ అయిన వారు కొత్త సేల్‌లో కొనేసుకోవచ్చు.

‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’లో దాదాపు లక్షకు పైగా వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ టాప్‌లు, స్మార్ట్‌వాచెస్, ఏసీ, ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపైనే కాకుండా.. గృహోపకరణాలపై కూడా భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపైనే ఎక్కువగా తగ్గింపు ఆఫర్స్ ఉంటాయని తెలుస్తోంది. శాంసంగ్‌, రియల్‌మీ, రెడ్‌మీ, ఒప్పో, ఐఫోన్, పోకో సహా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ఆఫర్స్ ఉండనున్నాయి.

Also Read: Prithvi Shaw Double Century: డబుల్ సెంచరీ చేసినా.. టీమిండియాలో చోటు గురించి ఆలోచించడం లేదు: పృథ్వీ షా

‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’లో కన్వర్టబుల్ ఏసీలు రూ. 26,499 ధరకు ప్రారంభం అవుతాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. వాషింగ్ మిషన్లు 60 శాతం తగ్గింపుతో అంబాటులో ఉండనున్నాయి. ఈ సేల్‌లో రిఫ్రిజిరేటర్లు రూ. 791 మంత్లీ ఈఎంఐ ఆఫర్లతో ప్రారంభం అవుతాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్మార్ట్ టీవీలు రూ. 6999 ధరతో ప్రారంభం అవుతాయట. క్లాత్, ఫ్యాషన్ వస్తువులపై 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్స్ ఉంటాయని పేర్కొంది. ఇక బ్యాంక్ కార్డ్స్ ద్వారా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

Show comments