Flipkart New Sale: మరో సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Big Bachat Dhamaal Sale 2023 Start From August 11 to 13: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ గత కొన్నిరోజులుగా వరుస సేల్‌లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ఆగష్టు 4 నుంచి 9 వరకు నిర్వహించింది. ఈ సేల్ అలా ముగిసిందో లేదో.. ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ (Big Bachat Dhamaal Sale 2023)ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు.. 3 రోజుల పాటు కొనసాగనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ మిస్ అయిన వారు కొత్త సేల్‌లో కొనేసుకోవచ్చు.
‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’లో దాదాపు లక్షకు పైగా వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్‌వాచెస్, ఏసీ, ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనే కాకుండా.. గృహోపకరణాలపై కూడా భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపైనే ఎక్కువగా తగ్గింపు ఆఫర్స్ ఉంటాయని తెలుస్తోంది. శాంసంగ్, రియల్‌మీ, రెడ్‌మీ, ఒప్పో, ఐఫోన్, పోకో సహా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ఆఫర్స్ ఉండనున్నాయి.
Also Read
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’లో కన్వర్టబుల్ ఏసీలు రూ. 26,499 ధరకు ప్రారంభం అవుతాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. వాషింగ్ మిషన్లు 60 శాతం తగ్గింపుతో అంబాటులో ఉండనున్నాయి. ఈ సేల్‌లో రిఫ్రిజిరేటర్లు రూ. 791 మంత్లీ ఈఎంఐ ఆఫర్లతో ప్రారంభం అవుతాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్మార్ట్ టీవీలు రూ. 6999 ధరతో ప్రారంభం అవుతాయట. క్లాత్, ఫ్యాషన్ వస్తువులపై 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఆఫర్స్ ఉంటాయని పేర్కొంది. ఇక బ్యాంక్ కార్డ్స్ ద్వారా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..