Flipkart Big Saving Days: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరోసారి భారీ డిస్కౌంట్లతో “బిగ్ సేవింగ్ డేస్” (Big Saving Days) సేల్‌కు సిద్ధమైంది. ఈ సేల్ మార్చి 7, 2025న ప్రారంభమై, మార్చి 13, 2025న ముగియనుంది. ఈ సేల్‌లో వినియోగదారులకు పెద్ద ఎత్తున తగ్గింపు ధరల్లో ఉత్పత్తులను కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీ ప్రియులు, రిటైల్ థెరపీకి ఆసక్తి కలిగినవారు ఈ సేల్‌ను మిస్ కావద్దు.
Read Also: Jio Recharge: డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 5G ప్రయోజనాలతో రూ. 500లోపు బెస్ట్ ప్లాన్స్ మీకోసం
అలాగే, ఫ్లిప్‌కార్ట్, HDFC బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌లతో చేతులు కలిపి వినియోగదారులకు మరింత లాభాలను అందించనుంది. ఇందులో భాగంగా HDFC కార్డ్ వినియోగదారులకు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లతోపాటు, ఈ సేల్‌లో అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
Read Also: Posani Krishna Murali: పోసాని ఉక్కిరిబిక్కిరి..! కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రత్యేక ఆఫర్ల విషయానికి వస్తే.. బ్లూ 1.5 టన్ 3-స్టార్ AC కేవలం రూ. 32,360 కు, అసూస్ వివో బుక్ i3 మోడల్ కేవలం రూ. 29,990కు, జీబ్రానిక్స్ సౌండ్ బార్లు ప్రారంభ ధర రూ. 1,499, అలాగే ఇటీవల వచ్చిన ఐఫోన్ 16 కూడా పెద్ద డిస్కౌంట్‌లో లభించనుంది. ఈ సేల్ ఎలక్ట్రానిక్స్‌తో పాటు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపైనా విశేషమైన డిస్కౌంట్లు అందిస్తుంది. ఇందులో భాగంగా.. బ్యాగ్‌లకు సంబంధించి టాప్ బ్రాండ్ల నుంచి 60% వరకు తగ్గింపు, పర్సనల్ కేర్ ఉత్పత్తులకు 65% వరకు తగ్గింపు లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ త్వరలో మరిన్ని డీల్స్, ఆఫర్లను ప్రకటించనుంది. ప్రస్తుతానికి కొన్ని ఆఫర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మొత్తం మీద.. సేల్ ప్రారంభానికి ముందే ఇంకా చాలా ఆఫర్లు వెలుగు చూసే అవకాశం ఉంది. మీరు కొత్త ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లైతే, ఈ “బిగ్ సేవింగ్ డేస్” సేల్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ భారీ డిస్కౌంట్లను అందుకుంటే సరి.