భారత్, చైనా మధ్య విమాన కనెక్టివిటీ తిరిగి ప్రారంభం కానుంది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నవంబర్ 9 నుంచి షాంఘై, న్యూఢిల్లీ మధ్య రౌండ్-ట్రిప్ విమానాలను ప్రారంభించనుంది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరిచే దిశగా ఒక కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. షాంఘై, ఢిల్లీ మధ్య ప్రతి బుధ, శని, ఆదివారాల్లో ఈ విమానం నడుస్తుందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ విమానం షాంఘైలోని పుడాంగ్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:45 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది.
Also Read:Karur stampede: ‘‘దీపావళి జరుపుకోవద్దు’’.. యాక్టర్ విజయ్ పార్టీ సంచలన నిర్ణయం..
తిరుగు ప్రయాణంలో విమానం ఢిల్లీ నుండి సాయంత్రం 7:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:10 గంటలకు షాంఘై పుడాంగ్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ రూట్లో టిక్కెట్ల అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఐదు సంవత్సరాల తర్వాత రెండు దేశాలు ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించయించడం గమనార్హం. ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Weather Alert: ఏపీకి మరో అల్పపీడనం.. రేపు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
ఇండిగో ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 26 నుండి కోల్‌కతా నుండి చైనాలోని గ్వాంగ్‌జౌకు రోజువారీ విమానాలను ప్రకటించింది. ఇండిగో కూడా త్వరలో ఢిల్లీ-గ్వాంగ్‌జౌ మార్గంలో విమానాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.
