Flax Seeds: మహిళల హార్మోన్ల సమతుల్య పరిష్కారం కోసం ఇలా చేస్తే సరి!
- అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రయోజనకంగా అవిసె గింజలు.
- పోషకాల పరంగా అవిసె గింజలు టాప్ .
- లిగ్నన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అవిసె గింజలలో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్(HDL)ను పెంచుతాయి. ఈ కారణంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన ఆహారంగా అవిసె గింజలు నిలుస్తాయి.
Also Read: IND vs ENG: అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: జోస్ బట్లర్
Also Read
అవిసె గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి ప్రేగుల కదలికను పెంచి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇది మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. రోజూ అవిసె గింజలను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుకోవచ్చు.
అంతేకాకుండా.. అవిసె గింజలలో లిగ్నన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్‌ను తగ్గించే గుణాలను ఇవి కలిగి ఉంటాయి. వీటిలో ఉండే అధిక ఫైబర్ కడుపుని నింపే గుణాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఆకలి తగ్గించి, అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీనివల్ల బరువు తగ్గే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.
Also Read: Gummanur Jayaram: గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు.. రైలు పట్టాలపై పడుకోబెడతా..!
మరోవైపు ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా ఉంచి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇవి చర్మంపై మృత కణాలను తొలగించి, చర్మానికి సహజమైన కాంతిని అందిస్తాయి. అవిసె గింజల వినియోగం జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అవిసె గింజలు రుతుక్రమ సమస్యలు, మెనోపాజ్ సమయంలో కలిగే లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంఫ్లమేషన్ తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రభావాన్ని కలిగి ఉండటంతో, శరీరంలోని నొప్పులను, కీళ్ల వేదనలను తగ్గించడంలో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!