భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అక్కడ ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. టెస్ట్ సిరీస్ ఉత్కంఠ మధ్య, క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించింది బీసీసీఐ. టీమిండియా మరోసారి ఇంగ్లాండ్ లో పర్యటించనున్నది. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వచ్చే ఏడాది భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు T20, మూడు ODI మ్యాచ్‌లు ఆడనున్నట్లు ప్రకటించాయి. ODI, T20 సిరీస్‌లు రెండూ జూలై 2026లో ఇంగ్లాండ్‌లో జరుగనున్నాయి. ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ జూలై 1న ప్రారంభంకానుండగా, వన్డే సిరీస్ జూలై 14న ప్రారంభమవుతుంది.
Also Read:Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ జూలై 1న డర్హామ్‌లో ప్రారంభంకానుంది. ఆ తర్వాత మిగిలిన టీ20 మ్యాచ్‌లు జూలై 4, జూలై 7, జూలై 9, జూలై 11 తేదీల్లో జరుగుతాయి. దీని తర్వాత మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది. వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూలై 14న జరుగుతుంది. మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లు జూలై 16, జూలై 19 తేదీల్లో జరుగుతాయి.
Also Read:Supreme Court: “హైకోర్టు తప్పు చేసింది”.. యాక్టర్ దర్శన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు..
వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు తొలిసారి ఇంగ్లాండ్‌లో ఆడనున్నారు. టీ20ఐ సిరీస్ గురించి చెప్పాలంటే… వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్ ఆడే తొలి టీ20ఐ సిరీస్ ఇదే కావచ్చు.
భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్ (2026)
T20I సిరీస్
01 జూలై – మొదటి టీ20, రివర్‌సైడ్ (డర్హామ్), రాత్రి 11.00 గంటలకు
4 జూలై – రెండవ టీ20, ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్), రాత్రి 7 గంటలకు
7 జూలై – మూడవ టీ20 ట్రెంట్ బ్రిడ్జ్ (నాటింగ్‌హామ్), రాత్రి 11.00 గంటలకు
9 జూలై – నాలుగవ టీ20 బ్రిస్టల్, రాత్రి 11.00 గంటలకు
11 జూలై – 5వ టీ20, సౌతాంప్టన్, రాత్రి 11.00 గంటలకు
Also Read:AP Metro Rail Projects: విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్‌కు రంగం సిద్ధం.. రేపే టెండర్లు..!
వన్డే సిరీస్
14 జూలై – మొదటి వన్డే, ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), సాయంత్రం 5.30 గంటలకు
16 జూలై – రెండవ వన్డే, సోఫియా గార్డెన్స్ (కార్డిఫ్), సాయంత్రం 5.30 గంటలకు
19 జూలై – మూడవ వన్డే, లార్డ్స్ (లండన్), మధ్యాహ్నం 3.30 గంటలకు
5⃣ T20Is. 3⃣ ODIs
📍 England
Fixtures for #TeamIndia‘s limited over tour of England 2026 announced 🙌#ENGvIND pic.twitter.com/Bp8gDYudXW
— BCCI (@BCCI) July 24, 2025