Site icon NTV Telugu

Kerala: కారు-లారీ ఢీ.. ఐదుగురి మృతి

Acc

Acc

కేరళలో దారుణం జరిగింది. కన్నూర్‌లోని పున్నచ్చేరిలో అర్ధరాత్రి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కారులో మృతదేహాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. డెడ్‌బాడీలను పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: The Raja Saab :రాజసాబ్ లో స్పెషల్ సాంగ్..ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ హంగామా..

ఈ ప్రమాదంలో ఒక బాలుడు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు కలిచనడుక్కంకు చెందిన పద్మకుమార్(59), సుధాకరన్ (52), అతని భార్య అజిత (35), బావ కృష్ణన్ (65) మేనల్లుడు ఆకాష్‌గా గుర్తించారు. పద్మకుమార్ కారు నడుపుతుండగా సోమవరం అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కారు.. లారీలోకి దూసుకుపోయింది. అతి కష్టం మీద ఫైర్ సిబ్బంది, పోలీసులు బయటకు తీశారు.

Exit mobile version