Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్‌లో ఐదుగురు చిన్నారులు మృతి.. కలుషిత నీరే కారణం..!

Pak

Pak

పాకిస్థాన్ దేశంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ లోని సింధ్‌ రాష్ట్రంలో గల సంఘర్ జిల్లాలో బోర్‌వెల్‌లోని కలుషిత నీరు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మరణించారు. అయితే, ఈ ఐదుగురు పిల్లలు దాహం కావడంతో దగ్గరలో ఉన్న చేతి పంపులోని నీళ్లు తాగిన వెంటనే వారికి జ్వరం, విరేచనాలు, వాంతులు కావడంతో.. స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు తెలిపారు. ఇక, ఈ ఘటనపై సంఘర్ డిప్యూటీ కమీషనర్ స్పందించారు. ఆ పిల్లల కుటుంబానికి తాము అండగా ఉంటామని చెప్పారు.

Read Also: BJP Tiffin Box Baithaks: నేడు బీజేపీ టిఫిన్‌ బాక్స్‌ బైఠక్‌లు.. అల్పాహారం తెచ్చుకోనున్న కార్యకర్తలు..!

ఈ కలుషిత తాగునీరు మరణించిన పిల్లలు:
మురిద్ భట్టి (8 సంవత్సరాలు), ముంతాజ్ (3 సంవత్సరాలు), రషీద్ అలీ (5 సంవత్సరాలు), సానియా (4 సంవత్సరాలు), జమీరా (4 సంవత్సరాలు)గా గుర్తించారు. ఈ విషాద సంఘటన తర్వాత, డిప్యూటీ కమిషనర్ ఆరోగ్య అధికారులతో కలిసి నీటిని పరీక్షించడానికి గ్రామాన్ని సందర్శించారు. హానికరమైన పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ముందు జాగ్రత్త చర్యగా వ్యవసాయ భూమిలో అమర్చిన చేతి పంపును మూసివేశారు.

Exit mobile version