NTV Telugu Site icon

Lord Vishnu Statue In Sea: నడి సముద్రంలో నారాయణుడి విగ్రహం.. షాక్ లో మత్స్యకారులు

Lord Vishnu

Lord Vishnu

సముద్రంలో చేపలు పట్టటానికి వెళ్లిన మత్స్యకారులకు విష్ణుమూర్తి దర్శమిచ్చాడు. శంఖు, చక్రాలతో నారాయణుడి విగ్రహం మత్స్యకారులకు దొరికింది. పుదుచ్చేరిలో చేపల కోసం వల వేసిన మత్స్యకారులకు శంఖు, చక్రాలు ధరించిన శ్రీమన్నారాయణుడి ప్రతిభ లభ్యమైంది. ఆ విగ్రహాన్ని చూసిన వాళ్లు తన్మయత్వం చెంది భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరించారు. నారాయణుడి విగ్రహం దొరకటం మా అదష్ణం అని మత్స్యకారులు మురిసిపోతున్నారు. ఆ తరువాత పురావస్తు అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే సముద్ర తీరానికి చేరుకున్న అధికారులు వారి నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read Also: PM Modi: యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఒకే దేశంలో 2 చట్టాలపై నడవదు..

అయితే, ఈ విగ్రహం 8వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా పురావస్తు అధికారులు భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే మరింత సమాచారం దొరుకుతుందని.. ఆ విగ్రహం ఏ ప్రాంతానికి చెందినదో తెలుస్తుందని వారు చెప్పారు. తమిళనాడులోని చిన్నకాల్పట్టు గ్రామానికి చెందిన కొంతమంది చేపల వేటగాళ్లు.. పుదుచ్చేరి నడి సముద్రంలో వేటకు వెళ్లగా.. చేపల కోసం వేసిన వలకు ఆదిదేవుని విగ్రహం చిక్కడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

Read Also: Merugu Nagarjuna: చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?

ఇక శ్రీ మహా విష్ణువు విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. నారాయణుడి చూసి స్థానికులు తరిస్తున్నారు. సముద్రంలో స్వామి విగ్రహం దొరకడంతో ఆ విగ్రహం గురించి మరింత సమాచారం కోసం పురావస్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా శ్రీమన్నారాయణుడి విగ్రహం సముద్రంలో దొరకడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అస్సలు ఈ విగ్రహం నడి సముద్రంలోకి ఎలా వెళ్లింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా పడేశారా.. లేక ఎలా వచ్చిందనే దానిపై విచారణ కొనసాగుతుంది.

Show comments