Fish Forming : చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయం తో పాటుగా రైతులు పండించే పంటలే పాడి, పశువుల ద్వారా కూడా మంచి లాభాలను పొందుతూన్నారు.. అందులో చేపల పెంపకం కూడా ఒకటి.. అయితే కొన్ని జాగ్రత్రలను పాటిస్తే మరిన్ని లాభాలను పొందవచ్చు అని అక్వా నిపుణులు అంటున్నారు..అవేంటో ఒకసారి చుద్దాము.. ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి. 2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది. రకరకాల పెంపకంలో చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే మరిన్ని లాభాలను పొందవచ్చు..
అయితే చేపలను పెంచడానికి ముందుగా నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది..ఇక నీరు లేత ఆకుపచ్చ రంగుతో 28-32 డిగ్రీ ల సేం. గ్రే. ఉష్ణోగ్రత ,30-40సేం. మీ. పారదర్శకత కలిగి నీటిలో ఉండే ప్రాణవాయువు 5-8 పి. పి. ఎం., ఉండాలి. అలాగే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫేట్, భాస్వరం, కూడా పరిమిత స్థాయిలో ఉండాలి.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
చెరువు నీటిలో ప్రాణవాయువు తగ్గకుండా జాగ్రత్త పడాలి.నర్సరీ చెరువులో 8-10 సేం. మీ. పెరిగే వరకు 30-40 రోజుల పాటు పెంచి పెంపకం చెరువులో వదలాలి. పెంపకం చెరువులో 1.5 మీ. కు తగ్గకుండా ఉండాలి..
చెరువును సారవంతం చెయ్యడం చాలా ముఖ్యం.. అందుకోసం నెలకొకసారి ఎకరానికి 500కి. కోళ్ల పెంట, లేదా 1000 కి.పశువుల ఎరువు,8 కి. యూరియా, 20 కి. సూపర్ ఫాస్ఫేట్,3 కి పోటాష్ చొప్పున చేరువంతా చల్లాలి. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒక దాని తర్వాత మరొకటి వేయాలి… చేపలు మరీ వేడిని కూడా తట్టుకోలేవు.. అందుకే ఈ విషయం పై జాగ్రత్తలు తీసుకోవాలి..
ఇక చేపలకు మేతగా సెనగ , ప్రత్తి, చెక్క, ఖనిజలవణాలు మిశ్రమం తగు మోతాదుల్లో వాడాలి.15 నుంచి 20 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ చేసి కొన్ని చేపల్ని పట్టి పెరుగుదలను, ఆరోగ్యాన్ని పరిశీలించలి..చేపల్లో సూక్ష్మ జీవులు, పరాన్నా జీవుల వల్ల వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి నివారణ చేయాలి… అవసరం అనుకుంటే మందులను కూడా వాడాలి…
బాగా పెరిగిన చేప పిల్లలను సకాలంలో పట్టుకొని మార్కెట్ కు తరలించాలి..చేప కిలో సైజు పెరగడానికి 10-12 నేలలు పడుతుంది. వెదురు బుట్టలో ఐస్ తో ప్యాక్ చేసి వాటిని రవాణా చేస్తే చేపలు చెడిపోకుండా ఉంటాయి..
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి