Bird Flu: బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాలు.. వాళ్లకు మాత్రం కాసుల వర్షం!
- వణికిస్తున్న బర్డ్ ఫ్లూ
- తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్
- దీంతో చేపలకు పెరిగిన డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్డ్ ఫ్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించింది. వందలాది వైద్య బృందాలతో రంగంలోకి దిగింది. అటు కోళ్లఫారాలను కట్టడి చేస్తూ.. ఇటు ఇంటింటి సర్వేలు కూడా నిర్వహిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించకుండా నిలువరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. తూర్పుగోదావరి జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ల మృత్యువాతకు కారణం బర్డ్‌ఫ్లూ వైరస్ వల్లే అని తేలింది. కాగా.. ఈ వ్యాధి వల్ల పౌల్ట్రీ రైతులు భారీగా నష్టాలు చవిచూశారు.
READ MORE: Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ యుద్ధ సమయంలో పలికే నినాదం ఏదో తెలుసా? వింటే గూస్‌బంప్స్ ఖాయం..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో ఈ వైరస్ అంతగా కనిపించడం లేదు. కానీ జనాలలో భయం మాత్రం పెరిగింది. విశాఖలో బర్డ్ ఫ్లూ లేనప్పటికీ అక్కడి జనాలు చికెన్‌పై అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ.. నాన్‌వెజ్ లేకుండా ఉండటం కొంత మందికి కష్టం. దీంతో అలాంటి వాళ్లు చికెన్‌కి బదులుగా చేపలు, రొయ్యలపై పడుతున్నారు. దీంతో ఫిషింగ్ హార్బర్ వద్ద భారీగా జనాలు కనిపిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో చేపలు తక్కువ ధరకే దొరుకుతాయి.. అందుకే క్యూ కడుతుంటారనుకోకండి.. చేపలకు డిమాండ్ పెరుగుతుండటంతో రేట్లు అమాంతం పెంచేశారు. నెల రోజులుగా సరైన ఆదాయం రావడం లేదని.. ఇప్పుడు భారీగా తరలి వస్తున్నారని విక్రయదారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా వీరి జేబులు మాత్రం నిండుతున్నాయి. ప్రస్తుతం విశాఖ ఫిస్ మార్కెట్లో ప్రతి చేప కేజీ ధర రూ. 50 నుంచి రూ. 100 వరకు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. రొయ్యలు బుట్ట రూ.1500 నుంచి 2000 వరకు పెరిగింది. చేపలు రూ.800 నుంచి 600 వరకు చేరుకుంది. వంజరం రూ. 350 నుంచి 600 రూపాయలు వరకు పెరిగింది.
READ MORE: Hyundai Creta : ఒక్క కారు డెలివరీనే కాలేదు.. 1590శాతం పెరిగిన క్రెటా ఎలక్ట్రిక్ కారు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!