PM Modi: గురువారం శ్రీనగర్‌లో ప్రధాని మోడీ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన దగ్గర నుంచి విరామం లేకుండా ప్రధాని మోడీ (PM Modi) దేశమంతా చుట్టేస్తు్న్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ.. కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా నెల రోజుల నుంచి తీరిక లేకుండా ప్రధాని మోడీ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం మరో రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు.
గురువారం ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం ప్రధాని (PM Modi) మొదటిసారి కశ్మీర్ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరగనున్న ‘వికసిత్ భారత్… వికసిత్ జమ్మూకశ్మీర్’ కార్యక్రమానికి మోడీ హాజరుకానున్నారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.
Also Read
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరుతుండటంతో మోడీ కశ్మీర్ పర్యటన రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.
సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా పర్యటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్సుంది. ఏప్రిల్‌లో పోలింగ్ ముగించుకుని మే నెలలో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!