NTV Telugu Site icon

Parliament Sessions: సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం.. స్పీకర్‌ ఎంపికపై ఉత్కంఠ

Ne

Ne

18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతున్నాయి. 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ ఎంపీల చేత ప్రమాణం చేయించనున్నారు. ఇక ప్రొటెం స్పీకర్‌గా సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఒడిశాకు చెందిన భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయనున్నారు. ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. రెండ్రోజుల పాటు ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది.

ఇది కూడా చదవండి: CRIME: ప్రియురాలి సోదరుడితో కలిసి పెళ్ళాన్ని హతమార్చిన భర్త..

అయితే స్పీకర్ పోస్టుకు పోటీ నెలకొంది. ఈ పోస్టును ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు ఆశిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం తన దగ్గరే ఉంచుకోవాలని చూస్తోంది. అయితే రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి ఈ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరీ ఆ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.

ఇక జూన్ 24 ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పెషల్ సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. తొలుత ప్రధాని మోడీ ప్రమాణం చేశాక సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.

అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటంతో ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. జులై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.

ఇదిలా ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఈ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తామని చెబుతోంది. మరోవైపు ఈసారి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా సంపాదించింది. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Girl drags Boyfriend to Court: ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ప్రియుడిని కోర్టుకు లాగిన ప్రియురాలు..