రోహిణి అసెంబ్లీ స్థానానికి తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఆప్ అభ్యర్థి ప్రదీప్ మిట్టల్ కు 3235 ఓట్లు, బీజేపీ అభ్యర్థి విజేంద్ర గుప్తా కు 3187 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుమేష్ కు 177 ఓట్లు వచ్చాయి. 48 ఓట్ల ఆధిక్యంలో ఆప్ అభ్యర్థి కొనసాగుతున్నారు.
READ MORE: Sri Leela: బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో బోల్డ్ పాత్రలో శ్రీలీల..
మరోవైపు..న్యూఢిల్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇక్కడ 4943 ఓట్లు లెక్కించారు. కేజ్రీవాల్ కు 2198 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ కు 2272 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కు 404 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 74 ఓట్లతో బీజేపీ ముందజలో ఉంది. ఈ పరిణామాల మధ్య, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు.
READ MORE: ACB Rides: హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసాలపై ఏసీబీ దాడులు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం ఆసన్నమైంది. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు వెనుకబడి ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం. కాగా.. అదే సమయంలో, గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది.