NTV Telugu Site icon

Vettaiyan : వేట్టయన్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే

Vettaiyan

Vettaiyan

Vettaiyan : రజనీకాంత్ నటించిన కాప్ డ్రామా వేట్టయన్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా పండుగ సెలవుల సీజన్‌లో విడుదల కానున్న తొలి తమిళ చిత్రం కావడంతో ఈ విడుదల తేదీ ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ట్రైలర్‌లో మెయిన్ విలన్ ఎవరన్నది తేలకపోవడంతో చిత్ర యూనిట్ ఆడియెన్స్ లో కన్ఫ్యూజన్‌ను మరింత పెంచారు. విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. ఈ ట్రైలర్‌లో రజనీకాంత్ సినిమాల్లోని ‘వావ్’ మూమెంట్స్ లేవు, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు. జైలర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని వేట్టయన్ కనుమరుగు చేస్తుందా.. లేక లాల్ సలామ్ లాగా డిజాస్టర్ అందుకుంటుందా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మిక్స్డ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నప్పటికీ, రజనీకాంత్ కెరీర్‌లో ఇది మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Read Also:IND W vs NZ W: ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమి.. 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు!

ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా, ఇందులో రజినీకాంత్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా, ఈ చిత్ర ఔట్‌పుట్‌ని చూసి ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని తన సోషల్ మీడియాలో తనదైన మార్క్ రివ్యూ ఇచ్చాడు. అనిరుధ్ గతంలోనూ పలు సినిమాలకు రివ్యూ ఇవ్వగా, అవి విజయాన్ని అందుకున్నాయి. ఇక వేట్టయన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also:Rajendra Prasad : సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.

Show comments