Vettaiyan : వేట్టయన్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vettaiyan : రజనీకాంత్ నటించిన కాప్ డ్రామా వేట్టయన్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా పండుగ సెలవుల సీజన్లో విడుదల కానున్న తొలి తమిళ చిత్రం కావడంతో ఈ విడుదల తేదీ ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ట్రైలర్లో మెయిన్ విలన్ ఎవరన్నది తేలకపోవడంతో చిత్ర యూనిట్ ఆడియెన్స్ లో కన్ఫ్యూజన్ను మరింత పెంచారు. విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. ఈ ట్రైలర్లో రజనీకాంత్ సినిమాల్లోని ‘వావ్’ మూమెంట్స్ లేవు, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు. జైలర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని వేట్టయన్ కనుమరుగు చేస్తుందా.. లేక లాల్ సలామ్ లాగా డిజాస్టర్ అందుకుంటుందా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మిక్స్డ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నప్పటికీ, రజనీకాంత్ కెరీర్లో ఇది మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
Read Also:IND W vs NZ W: ప్రపంచ కప్‌లో భారత్ ఓటమి.. 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు!
Also Read
ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా, ఇందులో రజినీకాంత్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా, ఈ చిత్ర ఔట్‌పుట్‌ని చూసి ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని తన సోషల్ మీడియాలో తనదైన మార్క్ రివ్యూ ఇచ్చాడు. అనిరుధ్ గతంలోనూ పలు సినిమాలకు రివ్యూ ఇవ్వగా, అవి విజయాన్ని అందుకున్నాయి. ఇక వేట్టయన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also:Rajendra Prasad : సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!