NTV Telugu Site icon

Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. పలు రైళ్ల దారి మళ్లీంపు..!

Falaknuma Express

Falaknuma Express

హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదానికి గురికావడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రెండు రైళ్లను క్యాన్సిల్ చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌-రేపల్లె, సికింద్రాబాద్‌-మన్మాడ్‌ ట్రైన్స్ ను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. ఇక, సికింద్రాబాద్‌-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌ను (వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.

Read Also: Amitabh Bachchan: మక్కీకి మక్కీ దించేస్తే ఎలా సార్?

ఇక, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య ఇవాళ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు బెంగాల్‌ నుంచి సికింద్రాబాద్‌ కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లోని ఒక బోగీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ బోగీలో ఉన్న గమనించిన వెంటనే చైన్‌ లాగడంతో అప్రమత్తమైన లోకో పైలట్‌ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో బోగీలో ఉన్న ప్యాసింజర్లు ట్రైన్ లో నుంచి కిందకు దూకి దూరంగా పారిపోయారు.

Read Also: Wrestlers vs WFI: వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ

దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు రైలు బోగీల్లో ఉన్న ప్రయాణికులను దించేశారు. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది అని రైల్వే అధికారులు చెప్పారు. అయితే మంటలను ఆర్పే సిబ్బంది వచ్చేలోపే మిగతా బోగీలకు కూడా క్రమంగా నిప్పు అంటుకుంది. దీంతో ఆ ఏరియాలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఐదుబోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక బోగి పాక్షికంగా కాలిపోయిందని తెలిపారు.

Read Also: Konda Visveshwar Reddy: తెలంగాణలో అభివృద్ది బీజేపీతోనే సాధ్యం

అయితే, ఆరో బోగీ వద్ద ఉన్న జాయింట్‌ ను తొలగించడంతో మంటలు ఇతర బోగీలకు వ్యాప్తి చెందకుండా రైల్వే అధికారులు నిలిపివేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌ నుంచి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

Untitled