Fire in Dal lake: కాశ్మీర్‌లోని దాల్ సరస్సులోని పడవల్లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire in Dal lake: శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో శనివారం ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఐదు హౌస్ బోట్లు బూడిదయ్యాయి. సరస్సులోని పీర్ నంబర్ 9 వద్ద పార్క్ చేసిన హౌస్ బోట్లో మొదట మంటలు చెలరేగాయి. అది వేగంగా వ్యాపించి సమీపంలోని నాలుగు హౌస్ బోట్లను చుట్టుముట్టిందని పేర్కొంటున్నారు. మొత్తం ఐదు బోట్లు దగ్ధం కావడంతో కొంత సేపు పర్యాటకుల్లో భయానక వాతావరణం నెలకొంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. అయితే అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Read Also:Hyderabad Double Decker Buses: ఫ్రీ.. ఫ్రీ.. డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Also Read
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
దాల్ సరస్సులోని హౌస్బోట్లలో ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే మొత్తం ఐదు పడవలు కాలిపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో పడవలో ఎవరూ లేరు. చారిత్రక ప్రాముఖ్యత, సాంస్కృతిక విలువలకు ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు చేరుకునే పర్యాటకులు హౌస్ బోట్ల ద్వారా మాత్రమే ప్రయాణిస్తారు. దీని డిజైన్ కూడా చాలా ప్రత్యేకమైనది. దీని రూపురేఖలు శ్రీనగర్ చరిత్రకు సరిపోతాయి. మంటలు చెలరేగిన సమయంలో సరస్సు ఒడ్డున చాలా పడవలు ఆగి ఉన్నాయి. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు పర్యాటక పరంగా చాలా ప్రసిద్ధి చెందినది. జమ్మూ, కాశ్మీర్ లోయలను సందర్శించే ప్రజలకు ఇది ప్రధాన పర్యాటక కేంద్రం. సంవత్సరంలో ఎక్కువ భాగం స్తంభింపజేసే ఈ సరస్సులో హిమపాతాన్ని ఆస్వాదించడం ముఖ్యంగా పర్యాటకులకు థ్రిల్‌గా ఉంటుంది. ఇక్కడ తెల్లవారుజామున హౌస్‌బోట్‌లో మంటలు చెలరేగడంతో భయానక వాతావరణం నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించడంతో వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులతో పాటు అగ్నిమాపక శాఖ బృందం విచారణ చేపట్టనుంది.
Read Also:Rajahmundry Road Cum Railway Bridge: 45 రోజుల తర్వాత అందుబాటులోకి రోడ్ కం రైల్వే బ్రిడ్జి
తాజావార్తలు
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!