Bus Accident: జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న స్లీపర్ బస్సులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, 10 నుంచి 12 మంది కాలిపోయినట్లు సమాచారం. మంటల్లో కాలిపోయిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గురుగ్రామ్‌లోని సిగ్నేచర్ టవర్ సమీపంలో బస్సులో ఉన్నట్లుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also:Jawan : ఓటీటీ లో ఆ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన జవాన్ మూవీ..
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే లోపే బస్సు కాలి బూడిదైంది. సమాచారం ప్రకారం ఈ ప్రమాదం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తోంది. బస్సు గురుగ్రామ్‌లోని సిగ్నేచర్ టవర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగినప్పుడు బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే, బస్సు లోపల గందరగోళం ఏర్పడింది. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే ప్రజలు బయటకు రావడం ప్రారంభించారు. నిమ్మదిగా అగ్ని భయంకరమైన రూపం దాల్చింది. మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికే బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. 10 నుంచి 12 మంది కాలిపోయినట్లు సమాచారం. బస్సులో మంటలు ఎలా అంటుకున్నాయి? ఇది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం గురుగ్రామ్ పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.