Site icon NTV Telugu

Fire Accident : ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం.. 200 దుకాణాలు దగ్ధం..

Fire Accident Odisha

Fire Accident Odisha

ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెంధూఝర్ పట్టణంలోని ఓ మార్కెట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 వరకు దుకాణాల సముదాయం పూర్తిగా దగ్దమైయినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటనలో వ్యాపారులు రూ. కోట్ల రూపాయల సామాగ్రిని నష్టపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Read Also : Mansukh Mandaviya: కరోనా, హార్ట్ ఎటాక్ మధ్య సంబంధం.. కేంద్ర ఆరోగ్యమంత్రి స్పందన ఇదే..

వాటర్ సప్లై లేని కారణంగా మంటలను ఆర్డడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. అయితే.. ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా.. ఎవరికైనా గాయాలు అయ్యాయా అనే విషయాల గురించి సమాచారం బయటకు రాలేదు. ఈ ప్రమాదంపై కెంధూఝర్ జిల్లా సబ్ కలెక్టర్ రామచంద్ర కిస్కు స్పందించారు. మంటలు చేలరేగడానికి కారణం ఇంత వరకు తెలియలేదని చెప్పారు.

Read Also : DC Movies: సరికొత్త సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేసిన DC

అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. మంటలు చెలరేగడం వల్ల దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొంది. వ్యాపారులు వారి జీవనాధారమైన దుకాణాలను కోల్పోయారని కెంధూఝర్ జిల్లా సబ్ కలెక్టర్ రామచంద్ర కిస్కు అన్నారు.

Read Also : CM YS Jagan: రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్‌.. పర్యటన వివరాలు ఇవే..

రెస్క్యూ టీమ్ మంటలను అదుపు చేసేందుకు యంత్రాలతో రంగంలోకి దిగాయని కెంధూఝర్ తహశీల్దార్ ఆశిష్ మహాపాత్ర తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదు.. అయితే తగినంత నీటి సరఫరా కారణంగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. చివరకు 7-8 గంటల తర్వాత మంటలను ఆర్పివేశారని కెంధూఝర్ జిల్లా సబ్ కలెక్టర్ రామచంద్ర కిస్కు చెప్పారు.

Exit mobile version