NTV Telugu Site icon

Maharashtra: విజయోత్సవ వేడుకల్లో మంటలు.. ఎన్నికైన అభ్యర్థి సహా పలువురికి గాయాలు (వీడియో)

Mh News

Mh News

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. రాష్ట్రంలోని చంద్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే.. రాత్రి శివాజీ పాటిల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటిల్ గాయపడ్డారు. ఊరేగింపులో పాల్గొన్న కొందరు మహిళలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మహాగావ్‌లో శివాజీ పాటిల్‌ విజయం సాధించిన తర్వాత కొందరు మహిళలు ఆయనకు హారతి ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.

READ MOE: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విజయోత్సవ ర్యాలీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, మద్దతుదారులపై బుల్డోజర్ గులాల్ వర్షం కురిపించడం చూడవచ్చు. అయితే, గులాల్ నేలపై స్థిరపడటంతో అది భారీ అగ్నిని ప్రేరేపిస్తుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఎమ్మెల్యే, పలువురి మహిళలకు గాయాలైనట్లు సమచారం.

READ MOE:Hydrogen Train : మార్చిలో పట్టాలెక్కనున్న నీటితో నడిచే రైలు..

చంద్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి శివాజీ పాటిల్ ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం), ఎన్‌సీపీ (శరద్ పవార్‌ వర్గం) అభ్యర్థులపై పోటీ చేశారు. శివాజీ 24134 ఓట్ల తేడాతో విజయం సాధించి రెండు పార్టీల అభ్యర్థులకు ఘోర పరాజయాన్ని అందించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన రాజేష్ పాటిల్ రెండో స్థానంలో నిలిచారు.