రేణిగుంటలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగాయి. మంటల్లో చిక్కుకుంది ఓడాక్టర్ కుటుంబం. ఇద్దరిని రక్షించింది రెస్య్యూ టీం. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది.రేణిగుంట లోని కార్తీకా ప్రైవేట్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంట బిస్మిల్లా నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. హాస్పిటల్ పై పోర్షన్లోనే కాపురం ఉంటున్న డాక్టర్ కుటుంబం ఈ మంటల్లో చిక్కుకుంది. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్ లోనే మరికొందరు వున్నట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
రేణిగుంట కార్తీక్ హాస్పిటల్ లో కొనసాగుతూన్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇంకా మంటల్లో చిక్కుకుంది డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఫ్యామిలీ. రవిశంకర్ రెడ్డి పిల్లలు భరత్ రెడ్డి,కార్తీక ఇద్దరు మృతి చెందారు.
Read Also: Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గృహనిర్బంధం?.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు