హైదరాబాద్ లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బేగంబజార్ ఉస్మానియా ఆసుపత్రి సమీపంలోని పతాన్ వాడిలో ఈప్రమాదం జరిగింది. పతాన్ వాడిలో ఇండియన్ ఇమిటేషన్ గోల్డ్ జ్యూవెలరి షాప్ లో రాత్రి 9.30గంటల సమయంలో షార్ట్ సర్క్కుట్ తో భారీగా చెలరేగాయి మంటలు. సమాచారం అందుకున్న స్థానిక అఫ్జల్ గంజ్ పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది సంఘట స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తేవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ పోవడానికి దారి లేదు. దీంతో మంటలు ఆర్పడం కష్టమయింది.
Read Also: Veera Simha Reddy Movie Review: వీరసింహారెడ్డి
అది ఇరుకైన గల్లీ కావడంతో ఫైర్ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్యాయి. నాలుగు అంతస్థుల భవనం వరకు మంటలు వ్యాపించడంతో దాదాపు 8ఫైర్ ఇంజన్లతో 4గంటలపాటు శ్రేమించిన ఫైర్ అధికారులు ఎట్టకేలకు మంటలు అదుపు చేశారు.ఈ ఘటనలో దాదాపు 50లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు యజమాని తెలిపారు, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also: Dabbuku Lokam Dasoham 50 Years: యాభై ఏళ్ళ ‘డబ్బుకు లోకం దాసోహం’!