హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. ఇవాళ నగరంలోని చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కళ్యాణమండపం దగ్గర పార్క్ చేసిన డీసీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్‌లోని కూరగాయాల షాపులో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Also Read : Delhi Mayor: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం.. బాధ్యతలు చేపట్టనున్న షెల్లీ ఒబెరాయ్
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే దుకాణంలో మంటలు చెలరేగినట్లుగా అధికారులు వెల్లడించారు. నిన్న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోనూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కమర్షియల్ భవనంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను అలుముకుంది. దీంతో సమీపంలోని దుకాణ యజమానులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
Also Read : Theft in the temple: ఆలయంలోనే కన్నం వేద్దామనుకున్నాడు.. ఇంతలోనే..