Site icon NTV Telugu

Amit Shah: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుపై స్పందించిన అమిత్ షా.. పోలీసులు కేసు నమోదు..!

Anit Sha

Anit Sha

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైరల్ అవుతున్న వీడియోల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా మాట్లాడడం మనం చూడొచ్చు. అయితే, రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ రెడీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లతో పాటు ఆ వీడియోను షేర్ చేస్తుంది. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్‌లో పేర్కొంది.

Read Also: Sakshi Dhoni: ‘బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే’.. సాక్షి ధోనీ పోస్ట్ వైరల్!

ఇక, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఎలాంటి కామెంట్స్ చేయలేదని బీజేపీ తెలిపింది. వైరల్ అవుతున్న వీడియో మొత్తం ఫేక్ అని చెప్పుకొచ్చింది. అసలు ఆ వీడియోలో తెలంగాణలోని ముస్లింలకు రాజ్యాంగానికి విరుద్ధంగా కల్పించిన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని కమలం పార్టీ స్పష్టం చేసింది. కావాలనే ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. ఇది పెద్ద ఎత్తున హింసకు దారి తీసే ఛాన్స్ ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. వెంటనే ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల నుంచి డిలీట్ చేయాలని కోరింది.

Read Also: Haryana : ఆస్పత్రిలో ఉంచిన శవాన్ని తినేసిన కీటకాలు.. ఆందోళన చేసిన కుటుంబసభ్యులు

అయితే, దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ వింగ్ వీడియో ఏయే ఖాతాల్లో పోస్ట్ చేశారనే దానిపై ఎంక్వైరీ చేస్తుంది. ఈ మేరకు ఎక్స్, ఫేస్ బుక్‌లకు కూడా లేఖ రాసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ రియాక్ట అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది.. వారు చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం పద్దతి కాదని అతడు వెల్లడించారు.

Exit mobile version