Site icon NTV Telugu

TSLPRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ .. ఎల్లుండి నుంచి హాల్ టికెట్స్

Conistable

Conistable

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్ల్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. అయితే రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతుంది. పోలీస్ కానిస్టేబుల్( సివిల్ ), పోలీస్ కానిస్టేబుల్ ( ఐటీ అండ్ సీవో ) ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షల తేదీలను TSLPRB వెల్లడించింది.

Also Read : Komati Reddy : నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా

ఏప్రిల్ 30వ తేదిన ఈ రాత పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ లను ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్ సైట్ లో నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని టీఎస్ఎల్‌పీఆర్బీ పేర్కొనింది. హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.inకు మెయిల్ లేదా 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించవచ్చని టీఎస్ఎల్‌పీఆర్బీ వెల్లడించింది.

Also Read : Harish Rao : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టొద్దు..

కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారు అప్రమత్తమై వెంటనే తమ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఎలాంటి అలసత్వం వహించకుండా వెంటనే హాల్ టికెట్స్ సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి టీఎస్ఎల్‌పీఆర్బీ తెలిపింది

Exit mobile version