NTV Telugu Site icon

Final Judgement: ప్రణయ్ పరువు హత్య కేసు.. నేడే తుది తీర్పు

Pranay

Pranay

Final Judgement: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు.

Read Also: Producer : బన్నీ లుక్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన నిర్మాత

పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఛార్జిషీటు నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో తుది తీర్పును మార్చి 10కు న్యాయస్థానం రిజర్వు చేసింది. రెండవ అదనపు సెషన్స్, ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్య వైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు.

Read Also: IND vs NZ: రోహిత్ ఖాతాలో మరో “హిట్టు”.. భారత్ ఘన విజయం..

మిగతా నిందితులలో సుభాష్ శర్మ, అస్గర్ ఆలీ మినహా ఇతర ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. అస్గర్ ఆలీ గతంలో గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రలలోనూ కీలక నిందితుడిగా ఉన్నారు. చూడలి మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్నది.