ఫైనల్ డెస్టినేషన్.. హాలీవుడ్ లో ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే చావు ఎన్ని రకాలుగా ఉంటుందో ఈ సినిమాల్లో చూపించారు. ఫైనల్ డెస్టినేషన్ పేరుతో రూపొందిన హాలీవుడ్ భయానక థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 112 మిలియన్‌లకు మించి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత 2003, 2006, 2009, 20011లో వరుసగా సిరీస్‌లు విడుదల కాగా.. ఇవి మేకర్స్‌ను డబ్బులతో ముంచెత్తాయి.
READ MORE: Virat Kohli: టెస్ట్ క్రికెట్‌లో ముగిసిన రోకో శకం.. టీమిండియాను నడిపించే నాయకుడెవరు?
దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీలోని ఆరో భాగం విడుదలకు సిద్ధమైంది. “ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్” పేరుతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమైంది. ఈ మూవీకి జాచ్ లిపోవిస్కీ దర్శకత్వం వహించగా.. కైట్లీన్ సాంట జువాన కీలక పాత్రలో నటించారు. ఈ నెల 16న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. కాగా.. 15వ తేదీనే మన దేశంలో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా బెనిఫిట్ షోలో భాగంగా 15వ తేదీ రాత్రి 11.59 నిమిషాలకు రిలీజ్ అవుతుంది. ఈ ట్రైలర్ సైతం చాలా భయానకంగా ఉంది. చిన్న వస్తువులే మన ప్రాణాలు తీస్తాయో ఇందులో చూయించి భయపెట్టారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: పెద్దిరెడ్డి భూముల వ్యవహారం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..