NTV Telugu Site icon

Allu Arjun-Nani: బన్నీ, నాని మధ్య ఆసక్తికర సంభాషణ.. నెట్టింట వైరల్‌!

Allu Arjun Nani

Allu Arjun Nani

Nani and Allu Arjun Conversation: 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024లో ‘దసరా’ చిత్రానికి ఏకంగా ఆరు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. దసరా సినిమాలోని నటనకు గాను ‘నేచురల్ స్టార్’ నాని ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో దిగిన ఓ ఫొటోను నాని ఎక్స్‌లో షేర్‌ చేయగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ స్పందించారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్స్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

అవార్డుతో దిగిన ఫొటోను నాని ఎక్స్‌లో షేర్‌ చేయగా.. దీనిపై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘కంగ్రాట్స్ నాని. ఈ అవార్డుకు నువ్వు పూర్తి అర్హుడివి’ అని బన్నీ పేర్కొన్నారు. దీనికి నాని స్పందిస్తూ.. థ్యాంక్యూ బన్నీ. వచ్చే ఏడాది రూల్ చేసే వ్యక్తి మరెన్నో అవార్డులను ఇంటికి తీసుకువెళ్తాడని ఆశిస్తున్నా’ అని పుష్ప ది రూల్‌ను ఉద్దేశించి రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్‌పై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘అది నిజమవుతుందని నేను ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. బన్నీ, నాని మధ్య ఆసక్తికర సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Paris Olympics 2024: భారత జట్టుకు ఒలింపిక్‌ కమిటీ షాక్‌.. సెమీస్‌ నుంచి కీలక ప్లేయర్‌ ఔట్!

ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా పూర్తి చేశారు. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ నెల 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటించగా.. ఎస్‍జే సూర్య కీలక పాత్ర‌ చేశారు. మరోవైపు ‘పుష్ప ది రూల్‌’తో అల్లు అర్జున్‌ బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Show comments