YCP vs TDP: తెనాలి మున్సిపల్‌ సమావేశంలో రసాభాస.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Ycp Vs Tdp

Ycp Vs Tdp

YCP vs TDP: గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్‌ సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ జరుగుతుండగానే వైసీపీ, టీడీపీకి చెందిన ఇరుపార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ వాగ్వాదం కాస్తా మరింత ముదిరి సభలోనే వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు. ఈ గొడవలో పలువురు కౌన్సిలర్ల చొక్కాలు కూడా చిరిగిపోయాయి. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది.

Read Also: Merugu Nagarjuna: పార్టీ లైన్‌ దాటితే ఎవరికైనా అటువంటి పరిస్థితి తప్పదు..

×
×
Ad

ఎంత వారించినా గొడవ సద్దుమణుగకపోవడంతో ఛైర్‌పర్సన్‌ సభను అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. మున్సిపాలిటీలోని సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిలర్లు ఇలా సభలోనే ఒకరిపై ఒకరు తన్నులాడుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గొడవకు దిగిన సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ గొడవ అసలు ఎందుకు జరిగింది, ఎలా ప్రారంభమైందనే విషయం తెలియాల్సి ఉంది.