NTV Telugu Site icon

FIFA World Cup: సెమీస్ లో ఓడిన మొరాకో.. బీభత్సం సృష్టించిన అభిమానులు

Morocco

Morocco

FIFA World Cup: ఎలాంటి అంచనాలు లేకుండా మొరాకో జట్టు ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అడుగుపెట్టింది. భారీ అంచనాలు పెట్టుకున్న జట్లను సైతం ఓడించి సెమీ ఫైనల్ కు చేరింది. కానీ, బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో తమ జట్టు ఫైనల్‌కు చేరి కప్పు కొడుతుందనుకున్న మొరాకో అభిమానుల కలలు చెదిరిపోయాయి. ఫ్రాన్స్‌ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ తర్వాత బ్రస్సెల్స్‌ వీధుల్లో వారు బీభత్సం సృష్టించారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో అభిమానులు వీరంగం హింసకు దారి తీసింది. దాదాపు వంద మంది అల్లర్లకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చెత్తను ఒక్క దగ్గరికి చేర్చి నిప్పు పెట్టారు.

Read Also: Indian Air Force : ముగిసిన రఫెల్ డీల్.. ఇండియాకు చేరుకున్న ఆఖరి విమానం

పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. ఈ క్రమంలో పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లలో ఫ్రాన్స్ అభిమానుల కారు ఢీకొనడంతో ఓ బాలుడు చనిపోయాడు. పోలీసులపైకి పటాకులు, ఇతర వస్తువులు విసిరేశారు. దీంతో పరిస్థితి మించకుండా ఉండేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ వదిలారు. వాటర్‌ క్యానన్లతో ఆభిమానులను చెదరగొట్టారు. బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌లో మొరాకోపై 2-0 తేడాతో ఫ్రాన్స్‌ విజయం సాధించింది. ఆధ్యంతం హోరాహోరాగా సాగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జట్టులోని ఆటగాళ్ల ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో మొరాకో ఒక్కగోలు కూడా చేయకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది.