Site icon NTV Telugu

FIDE Grand Swiss 2025: ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌ vs మెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌.. గెలుపెవరిదంటే?

Chess

Chess

FIDE Grand Swiss 2025: FIDE గ్రాండ్ స్విస్ 2025 ప్రపంచ చెస్ అసోసియేషన్ (FIDE) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ చెస్ టోర్నీ. ఈ టోర్నీ ప్రపంచంలోని గ్రాండ్‌మాస్టర్లు, యువ ప్రతిభాశాలి చెస్ ఆటగాళ్లను కలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. టోర్నీలో మెన్, ఉమెన్ విభాగాల్లో రేటింగ్ పాయింట్లు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వాలిఫైయింగ్ అవకాశాల కోసం పోటీ పడుతున్నారు. ప్రపంచ మేధావులు, గ్రాండ్‌మాస్టర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ స్కిల్ల్స్‌ను ప్రదర్శిస్తున్నారు.

Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట పరిధిలో శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చిన మహిళ

ఇక ప్రస్తుత టోర్నీలో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ ఓపెన్ విభాగంలో పోటీపడుతున్నారు. తాజాగా జరిగిన ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్, భారత గ్రాండ్‌ మాస్టర్ గుకేశ్ తో జరిగిన మ్యాచ్ లో దివ్య 103 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించారు. ఈ మ్యాచ్ తర్వాత దివ్య ప్రస్తుతం 2478 రేటింగ్‌తో ఉన్నప్పటికీ, గుకేశ్ 2767 పాయింట్లతో మంచి రేటింగ్‌ను కలిగి ఉన్నారు. ఈ గేమ్ ద్వారా గుకేశ్ మూడు పరాజయాల అనంతరం డ్రా చేసుకొని ఊపిరి పీల్చుకున్నాడు.

ENG vs SA: టీ20లో 300+ స్కోర్.. ఏంటి భయ్యా ఆ కొట్టుడు.. ఫిల్ సాల్ట్ దెబ్బకు దక్షిణాఫ్రికా ఫ్యూజులు అవుట్!

ఇక మరోవైపు భారత గ్రాండ్‌మాస్టర్‌లు కూడా తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. ప్రజ్ఞానంద, ఇరిగేశి అర్జున్, నిహాల్ సరీన్, ప్రణవ్, అభిమన్యు పురాణిక్, లియోన్, ఆదిత్య మిట్టల్, రౌనక్ సాధ్వాని, నారాయణన్, ఆర్యన్ చోప్రా తమ ఎనిమిదో రౌండ్ గేమ్స్‌ను డ్రాతో ముగించిగా.. విదిత్, పెంటేల హరికృష్ణలు ఓటమి చవిచూశారు. కార్తికేయన్ మురళీ ఒకరు విజయాన్ని నమోదు చేశారు. ఇక మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి మొదటిసారి ఓటమిని చవిచూసింది. కజకిస్తాన్ ప్లేయర్ బీబీసారా అసబయేవా తో జరిగిన గేమ్‌లో కేవలం 39 ఎత్తుల్లో ఓటమి పాలైంది. మరో భారత స్టార్ ప్లేయర్ ద్రోణవల్లి హారిక రష్యా గ్రాండ్‌మాస్టర్ ఓల్గా గిర్యాతో జరిగిన గేమ్‌ను 43 ఎత్తుల్లో డ్రా చేసుకున్నారు. దీనితో వైశాలి 6 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి రెండో స్థానంలో కొనసాగుతుండగా.. హారిక 4.5 పాయింట్లతో 20వ స్థానంలో కొనసాగుతున్నారు.

Exit mobile version