FIDE Grand Swiss 2025: ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్ vs మెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్.. గెలుపెవరిదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIDE Grand Swiss 2025: FIDE గ్రాండ్ స్విస్ 2025 ప్రపంచ చెస్ అసోసియేషన్ (FIDE) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ చెస్ టోర్నీ. ఈ టోర్నీ ప్రపంచంలోని గ్రాండ్‌మాస్టర్లు, యువ ప్రతిభాశాలి చెస్ ఆటగాళ్లను కలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. టోర్నీలో మెన్, ఉమెన్ విభాగాల్లో రేటింగ్ పాయింట్లు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వాలిఫైయింగ్ అవకాశాల కోసం పోటీ పడుతున్నారు. ప్రపంచ మేధావులు, గ్రాండ్‌మాస్టర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ స్కిల్ల్స్‌ను ప్రదర్శిస్తున్నారు.
Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట పరిధిలో శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చిన మహిళ
Also Read
ఇక ప్రస్తుత టోర్నీలో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ ఓపెన్ విభాగంలో పోటీపడుతున్నారు. తాజాగా జరిగిన ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ తో జరిగిన మ్యాచ్ లో దివ్య 103 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించారు. ఈ మ్యాచ్ తర్వాత దివ్య ప్రస్తుతం 2478 రేటింగ్‌తో ఉన్నప్పటికీ, గుకేశ్ 2767 పాయింట్లతో మంచి రేటింగ్‌ను కలిగి ఉన్నారు. ఈ గేమ్ ద్వారా గుకేశ్ మూడు పరాజయాల అనంతరం డ్రా చేసుకొని ఊపిరి పీల్చుకున్నాడు.
ఇక మరోవైపు భారత గ్రాండ్‌మాస్టర్‌లు కూడా తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. ప్రజ్ఞానంద, ఇరిగేశి అర్జున్, నిహాల్ సరీన్, ప్రణవ్, అభిమన్యు పురాణిక్, లియోన్, ఆదిత్య మిట్టల్, రౌనక్ సాధ్వాని, నారాయణన్, ఆర్యన్ చోప్రా తమ ఎనిమిదో రౌండ్ గేమ్స్‌ను డ్రాతో ముగించిగా.. విదిత్, పెంటేల హరికృష్ణలు ఓటమి చవిచూశారు. కార్తికేయన్ మురళీ ఒకరు విజయాన్ని నమోదు చేశారు. ఇక మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి మొదటిసారి ఓటమిని చవిచూసింది. కజకిస్తాన్ ప్లేయర్ బీబీసారా అసబయేవా తో జరిగిన గేమ్‌లో కేవలం 39 ఎత్తుల్లో ఓటమి పాలైంది. మరో భారత స్టార్ ప్లేయర్ ద్రోణవల్లి హారిక రష్యా గ్రాండ్‌మాస్టర్ ఓల్గా గిర్యాతో జరిగిన గేమ్‌ను 43 ఎత్తుల్లో డ్రా చేసుకున్నారు. దీనితో వైశాలి 6 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి రెండో స్థానంలో కొనసాగుతుండగా.. హారిక 4.5 పాయింట్లతో 20వ స్థానంలో కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!