NTV Telugu Site icon

Fengal Cyclone: తెలంగాణకు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు జిల్లాలకు వర్ష సూచన

Telangana Rains

Telangana Rains

Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం ఫెంగల్ తుఫానుగా మారి మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. తమిళనాడు, పుదుచ్చేరి వైపు.. బలంగా దూసుకొస్తున్న ఈ ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్లౌడీ వెదర్ కండిషన్స్ ఉండనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Read Also: Tirumala: తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం