NTV Telugu Site icon

Pakistan: పాకిస్థాన్‌లోనూ బంగ్లాదేశ్‌లా తిరుగుబాటు భయం! ఆర్మీ చీఫ్ హెచ్చరిక

Pak Army Chief Munir

Pak Army Chief Munir

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు ప్రభుత్వాన్ని కూల్చేశాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని చిన్నభిన్నం చేశాయి. ప్రధాని దేశం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్‌ లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్‌ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ హెచ్చరిస్తూ.. దేశ భద్రత, జాతీయ సమగ్రతను కాపాడేందుకు తమ సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నందున అలాంటి కుట్రలను విజయవంతం చేయనివ్వబోమని చెప్పారు.

READ MORE: Manish Sisodia Bail: మనీష్ సిసోడియాకు ఊరట.. 17 నెలల తర్వాత బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

మతపెద్దల సదస్సులో జనరల్ మునీర్ మాట్లాడుతూ.. “పాకిస్థాన్‌లో ఎవరైనా ఇలాంటి అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తే, అల్లాపై ప్రమాణం చేస్తున్నాను.. మేము అది విజయవంతం చేయనివ్వం. ప్రపంచంలో ఏ శక్తీ పాకిస్థాన్‌కు హాని చేయదు ఎందుకంటే ఈ దేశం ప్రపంచం అంతమయ్యే వరకు ఉంటుంది. దేశం ఎంత ముఖ్యమో తెలియాలంటే ఇరాక్, సిరియా, లిబియాలను చూడాలి.” అని పేర్కొన్నారు. దేశంలో శాంతి, అస్థిరతలను నెలకొల్పడంలో సైన్యం అంకితభావంతో ఉందని కొనియాడారు. దేశంలో అరాచకం వ్యాప్తి చెందడానికి సోషల్ మీడియానే కారణమన్నారు.

READ MORE:Sunkishala Project: నేడు సుంకిశాల ప్రాజెక్టును సందర్శించనున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి

కశ్మీర్ అంశంపై మునీర్ ఏమన్నారు?
కశ్మీర్‌ వివాదం భారత్‌-పాక్‌ల మధ్య అపరిష్కృత ఎజెండా అని పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మునీర్‌ అన్నారు. దీన్ని పరిష్కరించాలని ఆయన కోరారు. పాకిస్థాన్ చాలా కాలంగా ఆఫ్ఘన్ శరణార్థులకు మద్దతు ఇస్తోందని.. ఆఫ్ఘనిస్తాన్ -పాక్ మధ్య శాంతియుత సంబంధాలను కొనసాగించాలని ఆయన నొక్కి చెప్పారు.