రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ఫోన్ వాడొద్దని చెప్పినందుకు.. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భజరంగనగర్‌లో చోటుచేసుకుంది. అంతకుముందు కూతురుపై కోపోద్రిక్తుడైన తండ్రి.. శాంతింపజేసేందుకు తాను వెళ్లిన గదికి వెళ్లి చూడగా.. అమ్మాయి ఉరివేసుకుని ఉండటం చూసి చలించిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోట పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకోలేదు.
Mahadev Betting App Scam: వైజాగ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం.. ఇద్దరు అరెస్ట్
బోర్‌ఖెడా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ ద్వారకా లాల్ మాట్లాడుతూ.. మృతురాలు నగరంలోని బోర్‌ఖెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తుంది. తండ్రి కూడా ఆ బాలికతోనే ఉంటున్నాడు. అయితే.. మొబైల్ వాడొద్దని తండ్రి కోపంతో బాలిక కృపాంగిని తిట్టడంతో తన గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత తండ్రి తన పని మీద బయటకు వెళ్లాడు. అయితే చాలా సేపటి వరకు ఆ గదిలో నుంచి ఎలాంటి మాటలు వినకపోవడంతో అమ్మమ్మ తలుపు తట్టింది. అయినప్పటికీ గట్టిగా తలుపులు కొట్టినా.. ఎలాంటి చలనం లేకపోవడంతో ప్రక్కన ఉన్నవారికి పిలిచి.. ఆ తర్వాత వారితో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా విద్యార్థి ఉరి వేసుకుని కనిపించింది.
Mallanna Jatara: ఐనవోలు జాతరకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు..
కాగా.. పరీక్షలు దగ్గరపడుతుండటంతో మొబైల్‌ను ఉపయోగించవద్దని చెప్పినట్లు తండ్రి తన ప్రాథమిక వాంగ్మూలంలో పోలీసులకు తెలిపాడు. ఇంతకు ముందు కూడా బాలిక మొబైల్ ఎక్కువగా ఉపయోగించేది.. చాలా సార్లు తిట్టేవాళ్ళం. కానీ ఆమె ఇలా చేస్తుందని తమకు తెలియదని బాలిక తండ్రి వాపోతున్నాడు. ఇదిలా ఉంటే.. 2023లో కోటాలో అత్యధికంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాస్తవానికి.. ప్రతి సంవత్సరం సవాళ్ళతో కూడిన పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాల భారం, ఇంటి నుండి దూరంగా ఒంటరితనం కారణంగా, స్వల్ప ఒత్తిడి కారణంగా ఆత్మహత్య సంఘటనలు ఉండేవి. అయితే 2023లో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.