NTV Telugu Site icon

Sons Betting Kills Father: మద్యం మత్తులో బెట్టింగ్.. తండ్రి చనిపోతుంటే వీడియో తీసిన కొడుకులు

Swimming Betting

Swimming Betting

Sons Betting Kills Father: నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య బెట్టింగ్ వారి కుటుంబంలో పెనువిషాదాన్ని నింపింది. చెరువులో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదాలని తండ్రీకొడుకులు పందెం కాశారు. మద్యం మత్తులో ఉండటంతో ఈదలేకపోయిన తండ్రి కృష్ణయ్య చెరువు నీటిలో మునిగి మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన నీటిలో మునిగిపోతున్న సమయంలో కొడుకులు వీడియోలు తీశారు.

గ్రామంలో పండుగ కావడంతో తండ్రి కొడుకులు మద్యం సేవించారు. అనంతరం సరదాగా ఈత కోసం చెరువు వద్దకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న వారు ఇవతలి నుంచి అవతలి ఒడ్డుకు ఈదాలని బెట్టింగ్ కాశారు. కొడుకులతో బెట్టింగ్ కాసిన తండ్రి.. చెరువులోకి దిగాడు. ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదడం ప్రారంభించాడు. అయితే, కొంత దూరం వెళ్లాక.. తండ్రి కృష్ణయ్య ఈదలేకపోయాడు. అసలే మద్యం మత్తులో ఉన్నాడు, పైగా లోతైన ప్రాంతం. దీంతో ఈదలేక పోయిన కృష్ణయ్య.. నీటిలో మునిగి చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అతడి కొడుకులు రవితేజ, ఉదయ్ కుమార్.. తండ్రి నీటిలో మునిగిపోతుంటే కాపాడాల్సింది పోయి వీడియోలు తీస్తూ ఉండిపోయారు.

NVSS Prabhakar: ఢిల్లీ నూతన ఎక్సైజ్ పాలసీ.. తెలంగాణ విధానాన్ని అనుసరిస్తోంది..

బుద్ధి లేని పని చేశారంటూ తండ్రి చావుకి కారణమైన కొడుకులపై గ్రామస్థులు మండిపడుతున్నారు. తండ్రి నీటిలో మునిగిపోతుంటే.. కాపాడాల్సింది పోయి వీడియోలు తీయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ నేరం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెట్టింగ్ కాసి తండ్రి ప్రాణం పోవడానికి కారణమైన ఇద్దరు కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show comments