Atrocious: ఇంత దారుణమా.. కన్నకూతురి మృతదేహాన్ని డబ్బులకు అమ్ముకుంటారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు హోలీ ఆడుతూ జారిపడి మృతి చెందిన ఘటన రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే.. మృతదేహానికి డబ్బులు ఇవ్వాలని.. లేదంటే ఇచ్చేది లేదని భర్తకు తేల్చిచెప్పాడు. అది ఎవరో కాదు కన్న తండ్రే. ఓ పక్క కన్న కూతురు చనిపోయిందన్న బాధేమీ లేకుండా.. ఆస్పత్రి ఖర్చుకు అయిన డబ్బులు ఇవ్వాలని కిరాతకం చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో మహిళ మృతదేహాన్ని తన భర్తకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌గఢ్ ప్రాంతంలోని పటాన్‌కు చెందిన బస్ మచాడీలో నివాసం ఉంటున్న నెలన్నర గర్భిణి రాజంతి దేవి సోమవారం హోలీ ఆడుకుంటుండగా జారి పడిపోయింది. ఆ తర్వాత మహిళను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. కాగా.. ఆస్పత్రిలోనే మృతురాలి కుటుంబీకులు, అత్తమామలు గొడవపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Also Read
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
Rohit Sharma: మేము వచ్చేశామంటూ తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
తన భార్య రాజంతి బాయి హోలీ ఆడేందుకు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిందని మహిళ భర్త అజయ్ బైర్వా చెప్పాడు. అక్కడ ఆమె తన సోదరి రీనా బాయితో కలిసి హోలీ ఆడిందని.. ఆ సమయంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆమె కడుపుకు తీవ్రంగా దెబ్బ తగిలిందని చెప్పాడు. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ. బుధవారం ఉదయం రాజంతి బాయి చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపాడు.
భర్త అజయ్ బైరవ తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్య మృతదేహాన్ని తన తల్లిదండ్రులు తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పాడు. తనను, తన కుటుంబాన్ని కూడా కొట్టారని అజయ్ చెప్పాడు. చికిత్స నిమిత్తం సుమారు రూ.50 వేలు ఖర్చు చేసినట్లు మృతురాలి రాజంతి బాయి తండ్రి చెబుతున్నాడు. మా డబ్బులు మాకిచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పాడన్నాడు. కాగా.. అజయ్, రాజంతి బాయిల వివాహం 2021లో జరిగింది. వీరికి ఏడాది కూతురు కూడా ఉంది. ప్రస్తుతం రాజంతి నెలన్నర గర్భిణి.
తాజావార్తలు
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!