NTV Telugu Site icon

Atrocious: ఇంత దారుణమా.. కన్నకూతురి మృతదేహాన్ని డబ్బులకు అమ్ముకుంటారా..?

Rajasthan

Rajasthan

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు హోలీ ఆడుతూ జారిపడి మృతి చెందిన ఘటన రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే.. మృతదేహానికి డబ్బులు ఇవ్వాలని.. లేదంటే ఇచ్చేది లేదని భర్తకు తేల్చిచెప్పాడు. అది ఎవరో కాదు కన్న తండ్రే. ఓ పక్క కన్న కూతురు చనిపోయిందన్న బాధేమీ లేకుండా.. ఆస్పత్రి ఖర్చుకు అయిన డబ్బులు ఇవ్వాలని కిరాతకం చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో మహిళ మృతదేహాన్ని తన భర్తకు అప్పగించారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌గఢ్‌ ప్రాంతంలోని పటాన్‌కు చెందిన బస్‌ మచాడీలో నివాసం ఉంటున్న నెలన్నర గర్భిణి రాజంతి దేవి సోమవారం హోలీ ఆడుకుంటుండగా జారి పడిపోయింది. ఆ తర్వాత మహిళను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. కాగా.. ఆస్పత్రిలోనే మృతురాలి కుటుంబీకులు, అత్తమామలు గొడవపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Rohit Sharma: మేము వచ్చేశామంటూ తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

తన భార్య రాజంతి బాయి హోలీ ఆడేందుకు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిందని మహిళ భర్త అజయ్ బైర్వా చెప్పాడు. అక్కడ ఆమె తన సోదరి రీనా బాయితో కలిసి హోలీ ఆడిందని.. ఆ సమయంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆమె కడుపుకు తీవ్రంగా దెబ్బ తగిలిందని చెప్పాడు. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ. బుధవారం ఉదయం రాజంతి బాయి చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపాడు.

భర్త అజయ్ బైరవ తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్య మృతదేహాన్ని తన తల్లిదండ్రులు తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పాడు. తనను, తన కుటుంబాన్ని కూడా కొట్టారని అజయ్ చెప్పాడు. చికిత్స నిమిత్తం సుమారు రూ.50 వేలు ఖర్చు చేసినట్లు మృతురాలి రాజంతి బాయి తండ్రి చెబుతున్నాడు. మా డబ్బులు మాకిచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పాడన్నాడు. కాగా.. అజయ్, రాజంతి బాయిల వివాహం 2021లో జరిగింది. వీరికి ఏడాది కూతురు కూడా ఉంది. ప్రస్తుతం రాజంతి నెలన్నర గర్భిణి.