NTV Telugu Site icon

Uttar pradesh : యూపీలో అమానుషం.. 36ఏళ్లుగా కూతురుని గదిలో బంధించిన తండ్రి

Up

Up

Uttar pradesh : ఉత్తరప్రదేశ్‎లో అమానుషం చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి బాగోలేదని కన్న కూతురుని గొలుసులతో 36ఏళ్లుగా గదిలోనే బంధించాడో తండ్రి. ఇన్నాళ్లూ ఆ మహిళకు కుటుంబసభ్యులు గది తలుపు కింద నుంచే భోజనాన్ని అందించేవారు. ఆ గ‌దిలోనే మ‌ల మూత్ర విసర్జన కూడా చేసేది. కిటికిలో నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయించేవారు. ఇటీవల ఆమె తండ్రి మరణించడంతో ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. దీంతో ఓ ఎన్జీవో ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను విడిపించారు. ఇప్పుడు ఆ మహిళకు 53సంవత్సరాలు. ఫిరోజాబాద్ తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన సప్నా జైన్ (53)కు మాన‌సిక పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. ఆ కార‌ణంతో సప్నా తండ్రి 36 ఏళ్ల కింద‌ట ఆమెను గదిలోకి తీసుకెళ్లి.. గొలుసులతో కట్టేసి.. బంధించాడు. అప్పటికీ సప్నా వయస్సు 17 ఏళ్లు.

Read Also: Nirmala Sitaraman: కూరగాయల మార్కెట్లో కేంద్ర మంత్రి.. జీఎస్టీ వేస్తారేమోనంటూ కామెంట్లు

స్థానిక ఎన్జీవో సేవా భారతి సభ్యులు మహౌర్‌కు కేసు గురించి హత్రాస్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అంజులా మహౌర్ కు సమాచారం అందించారు. అనంతరం ఎట్టకేలకు ఆమెకు విముక్తి కల్పించారు. ఆమె తండ్రి మరణించిన తరువాత, ఎన్జీవో తరఫున కొంతమంది మహిళలు ఆమె ఇంటికి వెళ్ళారు. బాధితురాలిని చూసినప్పుడు చాలా ఘోరమైన స్థితిలో ఉందని సేవా భారతి సీనియర్ సభ్యురాలు నిర్మలాసింగ్ చెప్పారు.

Read Also:MBBS in Hindi: స్టూడెంట్స్‎కు గుడ్ న్యూస్.. హిందీలోనూ ఎంబీబీఎస్ కోర్స్ చదివే అవకాశం

ఎమ్మెల్యే మహౌర్ మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని వారిని ఒప్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించారు. కొన్ని వారాల్లో ఆమె కోలుకుంటుందని వారు భావిస్తున్నారు. ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయితే, మహిళ పరిస్థితి గురించి తమకు తెలుసని, వైద్యులను సంప్రదించమని కుటుంబీకులకు పలుమార్లు చెప్పామని, అయితే తమ కుటుంబ విషయాలకు దూరంగా ఉండాలని ఆమె కుటుంబసభ్యులు అన్నట్లు ఆమె ఇరుగుపొరుగు వాళ్లు తెలిపారు.

Show comments