రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అతి వేగం మనుషుల ప్రాణాలను బలికొంటుంది. ఈ క్రమంలో.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం రాత్రి లైలుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రహన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
Read Also: Crime: కర్నూల్ జిల్లాలో ముగ్గురు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు గుర్తింపు..
మృతులు ఖులే పైక్రా, విజయ్ సన్వారా(18), లక్ష్మణ్ చౌహాన్ (22)గా గుర్తించారు. కాగా.. వీరు ఓ వివాహానికి హాజరయ్యేందుకు గెరుపాని గ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారురు. కాగా.. బైక్ ను పైక్రా నడుపుతున్నాడని.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో వారు మరణించినట్లు తెలిపారు. వీరంతా సుబ్ర గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లైలుంగాలోని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Viral Video: ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన అమ్మాయి.. స్టెప్పులు మాములుగా లేవు కదా..!
